Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
న్యూఢిల్లీ : పబ్లిక్ సర్వెంట్లు (ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు) దాఖలు చేసిన ఆస్తుల వివరాల వాస్తవికతను తనిఖీ చేయడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ సంబంధిత స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. పార్లమెంట్‌కు స్టాండింగ్ కమిటీ తన నివేదికను సమర్పించింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులు వార్షిక స్థిరాస్తి రిటర్న్‌లను దాఖలు చేయలేదని పేర్కొంటూ, పార్లమెంటరీ కమిటీ దానిని పరిశీలించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖను కోరింది. 2011 నుంచి 2022 కాలంలో 1,393 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారులు తమ ఆస్తుల వివరాలను దాఖలు చేయలేదని కమిటీ పేర్కొంది. ''ప్రభుత్వ పరిపాలనలో అవినీతి విస్తృత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ ఉద్యోగులు వార్షిక స్థిరాస్తి రిటర్న్‌లను సమర్పించని అంశాన్ని వివరంగా పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అవినీతిని నిరోధించే లక్ష్యంతో సమర్థవంత పద్ధతులను రూపొందించి, ప్రోత్సహించాలని ఆదేశించే అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ (యుఎన్‌సిఎసి)పై భారతదేశం సంతకం చేసిందని గుర్తు చేసింది. యుఎన్సిఎసికి సంబం ధించిన అంశాలతో సహా అవినీతి నిరోధక శాఖకు పర్సనల్, ట్రైనింగ్ డిపార్టమెంట్ నోడల్ విభాగమని కమిటీ పేర్కొంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇతర ఆలిండియా సర్వీస్‌లో ఉన్నభార్యా భర్తల జంటను ఒకే దగ్గర పోస్టింగ్ ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని, తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కమిటీ సూచించింది.