Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022 డిసెంబర్ 31 నాటికి క్యాట్‌లో 80,545 కేసులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
పదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కోరింది. ఈ మేరకు పార్లమెంట్‌కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికను సమర్పించింది. ప్రత్యేకంగా పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించింది. 2022 డిసెంబర్ 31 నాటికి ట్రిబ్యునల్‌లోని వివిధ బెంచ్‌లలో 80,545 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కమిటీ తెలిపింది. వీటిలో 16,661 కేసులు సున్నా నుండి ఏడాది వరకు, 46,534 కేసులు ఒకటి నుంచి ఐదేండ్ల వరకు, 16,000 కేసులు ఐదు నుంచి పదేండ్ల వరకు, 1,350 కేసులు 10 ఏండ్లకుగాపైగా పెండింగ్‌లో ఉన్నాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ప్రోసీజర్) రూల్స్-1987 ప్రకారం ప్రతి దరఖాస్తును ఆరునెలల్లోపు పరిష్కరించాల్సి ఉందని కమిటీ పేర్కొంది. ట్రిబ్యునల్‌లో పెన్షన్‌కు సంబంధించి దాదాపు 3,716 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించింది. ఆ కేసులను క్యాట్ పరిష్కరించాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రాధాన్యతా ప్రకారం అవసరమైతే ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించి పరిష్కరించాలని సూచించింది. క్యాట్‌లో కేసులు పెండింగ్‌లో పెరుగుతుండడాన్ని కమిటీ గుర్తించింది. తగినంత సంఖ్యలో సిబ్బంది అందుబాటులో లేకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణాలలో ఒకటిగా భావించింది. క్యాట్‌లో ఆమోదించబడిన సభ్యుల సంఖ్య చైర్మెన్‌తో సహా 70 (35 జ్యుడీషియల్ సభ్యులు, 35 అడ్మినిస్ట్రేటివ్ సభ్యులు) ఉండాలి. ప్రస్తుతం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రిబ్యునల్‌లోని కొన్ని బెంచ్‌లలో సభ్యుల ఖాళీ కారణంగా, తగినంత సంఖ్యలో డివిజన్ బెంచ్‌లు అందుబాటులో లేనందున కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కమిటీ నివేదికలో పేర్కొంది.