Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిప్పు రాజేస్తున్న పరివార్ మూకలు
హుగ్లీ : పశ్చిమ బెంగాల్లో మత ఘర్షణలను రాజేసేందుకు సంఘపరివార్ శ్రీరామనవమి ర్యాలీలను అవకాశంగా వినియోగి ంచుకుంటోంది. రామనవమి నాడు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా ర్యాలీలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిర్వహించాయి. పలుచోట్ల రంజాన్ వేడుకలు నిర్వహించుకుంటున్న మసీదుల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాయి. పొరుగున ఉన్న హౌరా జిల్లాలో అల్లర్లు, గృహ దహనాలు, వాహన దహనాలు చోటుచేసుకున్నాయి. నవమి ముగిసి రెండు రోజులైన తరువాత ఆదివారం సాయంత్రం హుగ్లీ జిల్లా రిష్రా పోలీస్ స్టేషన్ పరిధి జిటి రోడ్డులో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఆ సమయంలో రాళ్లు పడటంతో ఉద్రిక్తత నెలకొందని, పరిస్థితిని అదుపు చేశామని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బిమన్ఘోష్ గాయపడినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు. ర్యాలీలో ఉన్న వారు, స్థానికులు, పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు. రంజాన్ మాసంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు నవమి ముగిసిన రెండు రోజుల తర్వాత ర్యాలీ నిర్వహించారని టీఎంసీ అధికార ప్రతినిధి మజుందార్ విమర్శించారు.
మతోన్మాద కుట్రలను తిప్పికొట్టండి : సలీం
శాంతి, సామరస్యాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి కుట్రలను తిప్పికొట్టాలని సిపిఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం పిలుపునిచ్చారు. హౌరాలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.