Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ: జార్ఖండ్‌లో సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం పలాము చత్రా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో గౌతం పాసవాన్‌తో పాటు మరో నలుగురు మృతి చెందారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులతో పాటు భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన గౌతం పాసవాన్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరో ఇద్దరు మావోయిస్టులపై రూ.5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. పలాము ఛత్రా సరిహద్దుల్లో మావో యిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో సిఆర్పిఎఫ్ కోబ్రా యూనిట్‌తో కలిసి జాయింట్ టీమ్ ఆపరేషన్ ప్రారంభించామని అంతఘర్ అదనపు ఎస్పి కోమన్ సిన్హా తెలిపారు. ఎన్కౌంటర్లో ఐదు గురు మావోయిస్టులు చనిపోయారన్నారు. కొయెలిబెడ పోలీస్‌స్టేషన్ పరి ధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సుమన్ సింగ్ అంచల, సంజయ్ కుమార్ ఉసెండి, పరుశరాం ధంగల్లను అరెస్టు చేశామని తెలిపారు.