Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పీల్ పై 13న విచారణ
సూరత్ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉపశమనం లభించింది. సూరత్‌లోని సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మోడీ ఇంటిపేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన క్రిమినల్ కేసులో రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్‌లోని కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ అప్పీల్ చేశారు. దీనిపై సెషన్స్ కోర్టు సోమవారంబెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో తనకు విధించిన రెండేండ్ల శిక్షను నిలుపు చేయాలని, శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ రెండు పిటిషన్లు పెట్టుకున్నారు. ఎదుటిపక్షం వాదనలు వినకుండా ఆదేశాలు జారీ చేయలేమని అంటూ రాహుల్ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసినట్లు అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఆర్.పి.మోగెరా తెలిపారు.