Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వారం రోజులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు అడిగినందుకుగానూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ విద్యారÛ్హత పత్రాలను బయటపెట్టాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మోడీ సర్టిఫికెట్ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. తాజాగా ఇదే అంశంపై శివసేన చీఫ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. మోడీపై విమర్శలు గుప్పించారు. 'దేశంలో డిగ్రీ చదివిన యువతకు ఉద్యోగాలు లేకుండా పోయా యి. మోడీని డిగ్రీ సర్టిఫికెట్ చూపించాలని అడిగినందుకు రూ.25వేలు ఫైన్ విధించారు. మోడీకి ఏ డిగ్రీ ఉంది..? ఏ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు..? ఏ కళాశాల అయినా తన విద్యార్థి దేశానికి ప్రధాని అయితే గర్వపడుతుంది. ప్రధాని తమ కాలేజీలోనే చదివారు అంటూ గొప్పగా చెప్పుకుంటుంది. అయితే మోడీ చదివిన కళాశాలకు ఆ గర్వం ఎందుకు కలగలేదు..?' అంటూ ఉద్ధవ్ ప్రశ్నించారు.