Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిక్కిం: సిక్కింలో మంగళవారం భారీగా కురిసిన హిమ పాతం వల్ల ఆరుగురు పర్యాటకు లు మృతి చెందినట్టు పోలీసు అధి కారులు వెల్లడించారు. గ్యాంగ్ టక్ను నాథులాతో కలిపే జవ హర్ లాల్ నెహ్రూ రహదారిలోని 15వ మైలు వద్ద భారీగా మంచు కురవడంతో పర్యాటకులకు తీవ్ర గాయాల య్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళతో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హిమపాతానికి 80 మందికి పైగా పర్యాటకులు మంచులో చిక్కుకున్నారు. ఇప్పటికీ 150 మంది పర్యాటకులు 15వ మైలు వద్ద చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. ఇక మంచులో చిక్కుకున్న 30 మంది టూరిస్టులను సురక్షితంగా రక్షించి వారిని గ్యాంగ్టక్లోని ఎస్టీఎన్ఎం ఆస్పత్రి, రిఫరల్ హాస్పిటల్లో చేర్చినట్టు పోలీసులు వెల్లడించారు. హిమపాతంలో చిక్కుకున్న వందలాది టూరిస్టులను కాపా డేందుకు సిక్కిం పోలీసులు, ట్రావెల్ ఏంజెట్స్, టూరిజం శాఖ అధికారులు, వాహన డ్రైవర్లు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై చెక్పోస్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ సోనమ్ టెన్జింగ్ భూటియా మీడియాతో మాట్లాడుతూ.. 'టూరిస్టులకు 13వ మైలు వరకు మాత్రమే అనుమతి స్తూ పాస్లు ఇవ్వబడతాయి.