Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్ లోగోను మార్చిన మస్క్
- బ్లూబర్డ్ స్థానంలో డోజీ మీమ్
వాషింగ్టన్ : మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి మస్క్ మార్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండానే ట్విటర్ లోగో ''బ్లూబర్డ్''ను మార్చేశారు. దాని స్థానంలో డోజీకాయిన్‌కు సంబంధించిన 'డోజీ మీమ్' కనిపిస్తోంది. మంగళవారం ఉదయం ట్విటర్‌ను చూసిన వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. బ్లూబర్డ్ స్థానంలో డోజీ మీమ్ కనిపించడంతో అవాక్కయ్యారు. మొదట ట్విటర్ హ్యాక్ అయిందేమోనని భావించారు. ఆ లోగోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ స్పందించారు. ట్విట్టర్ లోగోను మార్చేసినట్టు ధ్రువీకరించారు. ఇప్పుడు బ్లూ బర్డ్ పాతది అయిపోయిందనీ, ఇకపై డోజీ మీమ్ ట్విట్టర్‌కు కొత్త లోగో అని వెల్లడించారు. ఈ మేరకు ఫన్నీ మీమ్‌ను ఎలన్ మస్క్ షేర్ చేశారు. దీంతో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా నంటూ మరో ట్వీట్ కూడా చేశారు. 2022 మార్చిలో మస్క్ ఒక ట్వీట్ చేశా రు. ''భావప్రకటనా స్వేచ్ఛ సూత్రాలకు కట్టుబడి ఉండటంలో ట్విటర్ విఫల మైంది. ఇప్పుడు ఏం చేయాలి'' అని ప్రశ్నించారు. దీనికి ఒక నెటిజన్.. ట్విట్టర్‌ను కొనుగోలు చేసి.. బర్డ్ లోగోను డోజీతో రీప్లేస్ చేయండి అని సూచించాడు. దానికి సరే అన్నట్టు అప్పట్లో మస్క్ స్పందించాడు. తాజాగా ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ షేర్ చేసిన మస్క్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ట్వీట్ చేశారు.'షిబా ఇనూ' అనే జపాన్ జాతి కి చెందిన కుక్క చిత్రాన్నే డోజీగా వ్యవహరిస్తుంటారు. 2013లో తొలిసారి డోజీకాయిన్ క్రిప్టోకరెన్సీకి, దానికి వెనక ఉండే బ్లాక్‌చైన్ సాంకేతికను జోక్ చేస్తూ ఈ డోజీని లోగోగా క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఈ డోజీ అలాగే కొనసాగుతున్నది. మస్క్ మొదటి నుంచి డోజీకాయిన్‌కు మద్దతుగా నిలి చారు. గతంలో డోజీ కాయిన్‌ను ట్విటర్లో ప్రమోట్ చేసిన మస్క్ ఇప్పుడు ఏకంగా ట్విటర్ లోగోకి కూడా దానినే వినియోగించారు. దీంతో ఈ కాయిన్ విలువ ఒక్కసారిగా 22 శాతం పెరగడం గమనార్హం.