Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో పండించే ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాడిక్కడ తెలంగాణ భవన్లో ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, టి. సాగర్తో కలిసి జూలకంటి రంగారెడ్డి విలేకరులతో మాట్లాడారు. గత సీజన్లలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అలసత్వంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అన్యాయం చేస్తోందని విమర్శించారు. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనిన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువస్తున్నారని విమర్శించారు. పలు నిబంధనలతో ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.