Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మజ్దూర్ కిసాన్ మార్చ్ చారిత్రాత్మకం
- దేశ భవిష్యత్తుకు మార్పు అవసరం
- 2024లో బీజేపీ సర్కార్‌ను గద్దెదించుతాం
- యువతకు ఉద్యోగ కల్పనలో మోడీ విఫలం ొ కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ సంస్థలు ధారాదత్తం : సంఘర్ష్ మార్చ్‌లో నేతలు
మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ మార్చ్ చారిత్రాత్మకమనీ, దేశ భవిష్యత్తుకు మార్పు అవసరమని నొక్కి చెప్పిందని పలువురు వక్తలు అన్నారు. బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సీఐటీయూ, ఎఐకెఎస్, ఎఐఎడబ్ల్యుయూ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ మార్చ్‌లో ఆయా సంఘాల నేతలు మాట్లాడారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశభవిష్యత్ కు మార్పు అవసరం..
ఈ మార్చ్ జాతీయ స్థాయిలో జరిగింది. ఇలాంటి ర్యాలీలు క్షేత్ర స్థాయిల్లో కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. దేశ భవిష్యత్తు కోసం మార్పు అవసరం. కార్పొరేట్, మతోన్మాద మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు గర్జించాల్సిన సమయం ఆసన్నమైంది.
- సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్
పేదలను దు:ఖంలోకి నెట్టే పాలన మోడీ సాగిస్తున్నారు. పేదలకు ఇచ్చే సబ్సిడీలను రద్దు చేస్తున్నారు. పేదలకు సంబంధించిన పథకాలకు బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధిస్తున్నారు. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. మరోవైపు యువతకు ఉద్యోగ కల్పన చేయటం లేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి మోడీ, తొమ్మిదేండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నది. కానీ ఆ హామీని మరిచిపోయారు. దేశంలోని పేదలకు ఉద్యోగాలు కల్పించని మోడీ, గోరక్షక్ పేరుతో రెచ్చిపోతున్న మూకలకు ఉద్యోగాలు ఇచ్చారు.
- ఏఐకేఎస్ అధ్యక్షుడు విజయ రాఘవన్
సీఐటీయూ అనుబంధంగా ఉన్న 12 సెక్టోరల్ ఫెడరేషన్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలు, బ్యాంకు, బీమా, బీఎస్ఎన్, ఎఐఎస్జిఇఎఫ్, సిసిజిఈయూ నాయకులు కూడా ర్యాలీలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎస్ ఉపాధ్యక్షులు హన్నన్ మొల్లా, ఎంపిలు శివదాసన్, నటరాజన్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
మార్చ్‌లో వేలాది మంది తెలంగాణ కార్మిక, కర్షకులు
మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీలో వేలాది మంది తెలంగాణకు చెందిన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, పి జంగారెడ్డి, సహాయ కార్యదర్శులు ఎం. శోభన్, కె. నాగిరెడ్డి, బొంతు రాంబాబు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు జె వెంకటేష్, భూపాల్, ఎస్.రమ, జయలక్ష్మి, సహాయ కార్యదర్శులు ఈశ్వర్ రావు, శ్రీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్. వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, బి. ప్రసాద్, పొన్నం వెంకటేశ్వరరావు, జగన్, మచ్చ వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, నారి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ల సేవలో మోడీ సర్కార్..
మోడీ సర్కార్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ల కోసం మాత్రమే పని చేస్తున్నది. ఇకనైనా దేశంలోని రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల కోసం పని చేయడం ప్రారంభించాలి.. దేశంలో ఆక్సిజన్, ఆస్పత్రి బెడ్లు, మెడిసన్ లేక లక్షలాది మంది ప్రజలు మరణించారు. ఉద్యోగాలు లేక యువత, పంటలకు సరైన ధర దక్క రైతులు, ఉపాధి పోయి వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
- ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలేపస్తుల్లో పేదలు..
దేశంలో కరోనా సమయంలో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. మరోపక్క అదానీ, అంబానీల ఆస్తులు పెరిగాయి. మోడీ ప్రభుత్వం పేదల వద్ద లాక్కొని పెద్ద పెద్ద కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది. ప్రభుత్వం రంగ సంస్థలను ధారాదత్తం చేశారు. యువతకు ఉద్యోగాలు లేవు. ఆకలితో పేదలు అలమటిస్తున్నారు.
- సీఐటీయూ అధ్యక్షులు కె. హేమలత
కార్పొరేట్ల లూటీకి వ్యతిరేకంగా పోరు
- ఏఐకేఎస్ ప్రధానకార్యదర్శి విజ్జూ కృష్ణన్
దేశంలో కార్పొరేట్ల లూటీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరు చేస్తున్నాం. మోడీ పాలనలో లక్షకు పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండున్నర లక్షలకు పైగా రోజు వారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఐక్య పోరాటాలతోనే భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఆపగలిగాం. మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించగలిగాం. నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను హననం చేశారు. దేశాన్ని లూటీ చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద మోడీ ప్రభుత్వాన్ని 2024లో గద్దెదించుతాం.
ట్రిపుల్ ఇంజిన్‌తో మోడీని ఓడిస్తాం
- ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
ప్రధాని మోడీ తెల్లారితే డబుల్ ఇంజిన్ పాలనంటూ ప్రకటన చేస్తున్నారు. అయితే, ఇక్కడ ట్రిపుల్ ఇంజిన్ అని చెప్పాలనీ, అందులో ఒకటి మోడీ, అమిత్ షా ఇంజిన్, రెండోది అంబానీ, అదానీ ఇంజిన్, మూడోది కార్పొరేట్, మతోన్మాద ఇంజిన్. దేశానికి వినాశకారిగా ఉన్నఈ ఇంజిన్‌ను కార్మికులు, రైతుల, వ్యవసాయ కార్మికులతో కూడిన ట్రిపుల్ ఇంజన్‌తో ఓడిస్తాం. మోడీ ఆటలు ఇక సాగవు. ఉపాధికి హామీ చట్టం అయినప్పుడు బడ్జెట్లో నాలుగు శాతం నిధులు కేటాయించారన్నారు. మోడీ సర్కారు క్రమంగా తగ్గిస్తూ ప్రస్తుత బడ్జెట్లో 1.3 శాతానికి తగ్గించింది. ఆహార భద్రత విషయంలో కూడా గతేడాది బడ్జెట్లో రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తే, రూ.1.97లక్షల కోట్లకు తగ్గించారు. దేశంలో 32 కోట్ల మంది ఎస్సీ (17 శాతం), ఎస్టీల (7 శాతం) పరిస్థితులు దారుణం.