Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోంశాఖ ప్రతిపాదన
న్యూఢిల్లీ : సమాజంలో వెనుకబడిన వర్గాల ఆహారం, ఆశ్రయం, విద్య వంటి అంశాలపై పనిచేసే అతిపెద్ద ఎన్‌జిఓల్లో ఒకటైన ఆక్స్‌ఫామ్ ఇండియా ఎఫ్సిఆర్ఎ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ కేంద్ర హోంశాఖ గురువారం సిఫార్సు చేసింది. విదేశీ నిధులను అందుకునేందుకు వీలు కల్పించే ఎఫ్సిఆర్ఎ రిజిస్ట్రేషన్‌ను 2021లో ఆక్స్‌ఫామ్ ఇండియా పునరుద్ధరించుకోలేదని పేర్కొంది. సామాజిక కార్యకలాపాలు చేపట్టేందుకు ఎఫ్సిఆర్ఎ కింద ఎన్జిఓ రిజిస్టర్ అయిందని, ఆ రిజిస్ట్రేషన్ 2021 డిసెంబరు 31వరకు చెల్లుబాటైందని గురువారం సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. విదేశీ విరాళాల (క్రమబద్ధీకరణ) సవరణ చట్టం, 2020 అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వివిధ ఇతర సంస్థలకు విదేశీ నిధులను బదిలీ చేయడాన్ని ఆక్స్‌ఫామ్ కొనసాగించిందని ఆయన చెప్పారు.