Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రం విడిపోయేటప్పుడు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా తెలంగాణకి మోడీ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య విమర్శించారు. గురువారం నాడిక్కడ తెలంగాణ, ఏపీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ తో కలిసి విలేకరుల సమా వేశంలో జి. నాగయ్య మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాజీపేట కోచ్ సెంటర్ ఏర్పాటు, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గిరిజన యూని వర్సిటీ ఏర్పాటు 8 ఏండ్లు గడిచినా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోడీ నిలువునా మోసం చేశారని విమర్శించారు. కాజీపేటకు రావలసిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించాలని, బయ్యారం ఉక్కు గనుల ఫ్యాక్టరీ మోడీ అనుచరుడైన అదానీ కనుసైగలతో గుజరాత్‌కు తరలించారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ పాలకులు తెలంగాణలో అధికారం లోకి వస్తామని కలలగంటున్నారని, ఇది వారికి కలగానే మిగులుతుందని హెచ్చరించారు.