Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీఠ్య పుస్తకాల ద్వారా చరిత్ర సిలబస్‌ను మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఐ(ఎం)పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. సిలబస్‌ను క్రమబద్ధీకరించేందుకు, విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకే ఇలా చేశామని ఎన్సీఈఆర్టీ చీఫ్ చేస్తున్న విచిత్రమైన వాదన పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా పేర్కొంది. చరిత్రను మతోన్మాద ధోరణులతో తిరగరాయడానికి చేస్తున్న ప్రాజెక్టులో ఇది ఒక భాగమని పొలిట్‌బ్యూరో విమర్శించింది. కేవలం మతతత్వ అభిప్రాయ భేదాలను ప్రాతిపదికగా తీసుకుని వివిధ కాలాలకు సంబంధించిన మన గతాన్ని తొలగించలేమన్న అంశాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని సీపీఐ(ఎం) తప్పుబట్టింది. మొఘల్ సామ్రాజ్యం గురించిన మొత్తం అధ్యాయాలను తొలగించడం ద్వారా చరిత్రను వక్రీకరించే మెజారిటీవాదుల ధోరణిని ఇది నొక్కి చెబుతోందని ఆ ప్రకటన పేర్కొంది. మహాత్మా గాంధీ హత్య, తదనంతరం ఆర్ఎస్ఎస్ను నిషేధించ డానికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన కీలకమైన పాఠ్య భాగాలను తొలగిం చాలని ప్రభుత్వం భావించిన తీరు చూస్తుంటే ఆర్ఎస్ఎస్ విచ్ఛిన్నకర, హింసాత్మక పాత్రను తుడిచిపెట్టే ఉద్దేశ్యంతోనే ఈ పాఠ్య పుస్తకాలను సవరించేందుకు ప్రస్తుత ప్రయత్నాలు చేపట్టినట్లు స్పష్టమవుతోందని పొలిట్‌బ్యూరో విశ్లేషించింది. హేయమైన ఈ చర్యలను తిప్పికొట్టడానికి, పాత పాఠ్య పుస్తకాలను పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మన గతాన్ని నిష్పక్షపాతంగా అధ్యయనం చేయడంలో ఆసక్తి కలిగిన దేశభక్తులందరూ తక్షణమే తమ నిరసన గళాన్ని వినిపించాలని సీపీఐ(ఎం) కోరింది.