Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశానికి ప్రమాదకరం : మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ : తక్కువ విద్యారహతలు కలిగిన ప్రధాని దేశానికి ప్రమాదకరమని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, లిక్కర్ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మనీష్ సిసోడియా పేర్కొన్నారు. జైలు నుంచి శుక్రవారం ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ లేఖను ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఏదో ఒకటి సాధించాలని నేటి యువత ఆకాంక్షిస్తుంటారు. అవకాశాల కోసం వెతుకుతుంటారు. వారు ప్రపంచాన్ని గెలవాలని కోరుకుంటారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సృష్టించాలని భావిస్తారు. అయితే తక్కువ విద్యారÛ్హతలున్న ప్రదానికి నేటి యువత ఆకాంక్షను నెరవేర్చగలరా అని సిసోడియా ఆ లేఖలో ప్రశ్నించారు. రోజురోజుకి శాస్త్ర సాంకేతిక రంగాలు పురోగమిస్తున్నాయని, కృత్రిమ మేథస్సు (ఎఐ) గురించి ప్రపంచం మాట్లాడుతోందని అన్నారు. మురికి కాలువలోని డర్టీ గ్యాస్ ని టీ, ఫుడ్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చని ప్రధాని చెప్పడాన్ని వింటే తన గుండె తరుక్కుపోతోందని, మేఘాల వెనక ఉన్న విమానాలను రాడార్లు గుర్తించలేవనే వ్యాఖ్యలతో పాఠశాల, కళాశాల విద్యార్థులను ప్రధాని ఎగతాళి చేస్తున్నారని సిసోడియా లేఖలో పేర్కొన్నారు.