Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘ్‌పరివార్‌పై పినరయి విజయన్ విమర్శ
న్యూఢిల్లీ : చరిత్రను చూసి సంఘ్ పరివార్ భయపడుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. ఎన్సీఈఆర్టీ తన పాఠ్యాంశాల నుంచి మొఘలుల చరిత్రను తొలగించడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ సంఫ్‌ు పరివార్ అసలు రంగు బయటపడిందని అన్నారు. చరిత్రను తిరగరాసి, దానిని అసత్యాలతో నింపడానికి సంఘ్ ప్రయత్ని స్తోందని విమర్శించారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుండి కొన్ని భాగాలను తొలగించాలన్న బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వాస్తవాలు వెలుగు చూడాల్సి ఉందని విజయన్ ట్విట్ చేశారు.