Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారు. శుక్రవారం నాడిక్కడ బిజెపి ప్రధాన కార్యాలయంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ప్రహ్లాద్ జోషి, బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ కుటుం బానికి నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధముందని, తమ ఎదుగుదలకు కారణమైన పార్టీని వీడాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదన్నారు. తమ తప్పు లేదు, ఓటు వేయని ప్రజలదే తప్పనే మనస్తత్వం కాంగ్రెస్ నాయకత్వంలో ఉందన్నారు. ఈ కారణంతోనే తాను పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. ఆ తరువాత బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు.