Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లైంగికదాడి కేసు విచారణను పురుష న్యాయమూర్తి నుంచి మహిళా న్యాయమూర్తికి బదిలీ చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బదిలీకి అంగీకరిస్తే ఈ తరహా కేసులను ప్రత్యేక కోర్టులకు పంపాలంటూ పుంఖానుపుంఖాలుగా అభ్యర్థనలు వస్తాయని వ్యాఖ్యానించింది. పోర్నోగ్రఫీ వెబ్సైట్లో బాధితురాలి ఫొటోను దుర్వినియోగం చేశారంటూ దాఖలైన ఈ కేసు విచారణ కోర్టులో అపరిష్కృతంగా ఉంది. లైంగిక ఆరోపణలను విచా రించే కోర్టు నుంచి ఈ కేసును బాలల పరిరక్షణ కోర్టుకు బదిలీ చేయాలంటూ బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ కోర్టుకు హాజరు కావడం తనకు సౌకర్యవంతంగా లేదని ఆమె వాపోయారు. అందువల్ల కేసును మహిళా కోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్థించారు. అయితే కేవలం ఆందోళన చెందిన కారణంగా కేసును బదిలీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.