Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : రాజస్థాన్లోని బర్మర్ జిల్లాలో లైంగిక, యాసిడ్ దాడికి గురైన దళిత యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం చనిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం..షాకూర్ ఖాన్ అనే వ్యక్తి యువతి ఇంటిలోకి ప్రవేశించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. రక్షించేం దుకు పొరుగు వారు వస్తుండగా ఆమెపై యాసిడ్ పోసి నిప్పంటించాడు. అక్కడ నుంచి పరారయ్యాడు. నలభై శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతి ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద అతనిపై అభియోగాలు మోపారు.