Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మాయిల దుస్తులపై బీజేపీ నేత కైలాశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : బీజేపీ నేతలు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా... వారి వాచాలత ఒకే విధంగా వుంటుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌ను నిజంగా ప్రేమించాడా? అనే అంశంపై విచారణ జరపాలనీ, అసలు తాజ్‌మహాల్‌ని కూల్చేయాలని అసోంకి చెందిన రూపజ్యోతి కుర్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిపుర అసెంబ్లీలో పోర్న్ వీడియో చూస్తూ దొరికిపోవడం వంటివి దేశప్రజలు చూస్తూనే వున్నారు. తాజాగా అమ్మాయిలు ధరించే డ్రెస్సుల వల్ల దేవతల్లా కాకుండా.. శూర్పణఖల్లా కనిపిస్తున్నారని బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గియా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. కైలాశ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం హనుమాన్ జయంతి, మహావీర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ పాల్గొని మాట్లాడుతూ.. 'నేను రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో ఉన్న యువకులను చూస్తే వారిని ఐదారు చెంపదెబ్బలు కొట్టాలనిపిస్తుంది. ఇక మనం ఆడపిల్లలను దేవతల్లా భావిస్తాం. కానీ వారు వేసుకునే డ్రెస్సుల్ని చూస్తే వారు దేవతల్లా కాదు.. శూర్పణఖల్లా కనిపిస్తారు. మంచి బట్టలు వేసుకోమని మీ పిల్లలకు మీరు నేర్పించండి' అని ఆయన అన్నారు. కైలాశ్ వ్యాఖ్యలకు సోషల్‌మీడియా నెటిజన్లు, ప్రతిపక్షనేతలు నైతికవిలువల్ని దిగజార్చుతున్నారని ఆయనపై మండిపడ్డారు.కాగా, కైలాశ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సంగీతా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మహిళలను పదేపదే అవమానిస్తున్నారని, ఇది వారి ఆలోచనాతీరుకి, వైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కైలాష్ విజయవర్గీయ మహిళలను శూర్ఫణఖలని అనడం, వారి దుస్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.