Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే నెల నుంచి అమెరికా వీసా ఖర్చు మరింత ప్రియం కాబోతోతున్నది. కొన్ని విభాగాలకు సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజుల రేటు పెరుగబోతున్నది. ఈ పెరుగుదల 15 నుంచి 110 డాలర్ల వరకూ ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. మే 30 నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వస్తాయి. పర్యాటకులు, వ్యాపారులు, విద్యార్థులపై మరింత భారం పడుతుంది. విజిటర్స్ వీసాపై వెళ్లే పర్యాటకులు, వ్యాపారులు, అలాగే విద్యార్థులు అధిక ఫీజు చెల్లించాలి. వారిపై 160 నుంచి 185 డాలర్ల వరకూ అదనపు భారం పడుతుంది. వివిధ కేటగిరీల కింద వెళ్లే తాత్కాలిక ఉద్యోగులు 190 నుంచి 205 డాలర్ల వరకూ అదనంగా చెల్లించాలి. ఈ-కేటగిరీకి సంబంధించి ఫీజు 205 నుంచి 315 డాలర్ల వరకూ పెరుగుతుంది. భారతీయులు వీసాల కోసం ఎదురు చూసే సమయాన్ని తగ్గించేందుకు ఇటీవలి కాలంలో అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది. దేశం లోపల హెచ్-1 బీ వీసాలకు సంబం ధించి కొన్ని కేటగిరీలకు స్టాంపింగ్ నిమిత్తం రాబోయే నెలల్లో పైలెట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు అమెరికా విదేశాంగ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేస్తున్న భారతీయులు ఎదురు చూసే సమయం 60 నుంచి 280 రోజులు పడుతున్నది. సాధారణ ప్రయాణికులైతే ఏడాదిన్నర వరకూ ఎదురు చూడాల్సి వస్తోంది. అమెరికా రాయబార కార్యాలయం గతేడాది భారతీయ విద్యార్థులకు 1.25 లక్షల స్టూడెంట్ వీసాలు మంజూరు చేసింది. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. భారతీయుల కోసం రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసేందుకు అమెరికా రాయబార కార్యాలయం, భారత కాన్సులేట్ కార్యాలయాలు ప్రయత్నిస్తున్నాయి.