Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్ల్లలో 89 వేల హెక్టార్ల పచ్చటి సంపద కనుమరుగు
- రహదారులు , అటవీయేతర ప్రయోజనాల కోసమంటూ కార్పొరేట్లకు మళ్లింపు
పచ్చదనం ఉంటేనే మానవమనుగడ సమతుల్యంగా ఉంటుంది.పక్షులు,పశుసంపద సుభిక్షంగా ఉంటుంది. లేదంటే..పర్యావరణం దెబ్బతినడమే కాదు. అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనవాసాల్లోకి దూసుకువస్తాయి. ఇపుడు అదే జరుగుతోంది. అడవులు అదృశ్యమైపోతున్నాయి. అటవీసంపదను కొల్లగొట్టటానికి ,, అడవులనే జీవనాధారంగా చేసుకున్న గిరిజనులనే తరిమేసేలా చట్టాలకు సవరణలు జరుగుతున్నాయి. అడవుల సంరక్షణ బిల్లులంటూ తెరపైకి తెచ్చి.మొత్తం అడవులే లేకుండా చేస్తున్నారు.కార్పొరేట్ దోస్తులకు పచ్చని అడవులతో పాటు సమస్త సహజ వనరులనూ బీజేపీ ప్రభుత్వం కట్టబెడుతుంది.
న్యూఢిల్లీ: భారతదేశంలో గత ఐదేండ్లలో 89 వేల హెక్టార్ల అడవి (రికార్డెడ్ ఫారెస్ట్) కనుమరుగైంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ఇచ్చిన సమాచారం ప్రకారం, దేశంలోని సుమారు 89 వేల హెక్టార్ల అటవీ భూమి రోడ్లు మొదలైన 25 రకాల అటవీయేతర అవసరాల కోసం మళ్లించడానికి అనుమతించబడింది. వాస్తవానికి ఇంత పెద్ద విస్తీర్ణంలో అనేక చిన్న పట్టణాలకు వసతి కల్పించవచ్చని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
భూభాగంలో 24 శాతం అటవీ విస్తీర్ణం
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలోని మొత్తం భూభాగంలో దాదాపు 24 శాతం అటవీ విస్తీర్ణంలో ఉంది.డిబ్ల్యూ వెబ్సైట్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, 88,903.80 హెక్టార్ల అటవీ భూమిని 25 రకాల అటవీయేతర ప్రయో జనాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతించిందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. రోడ్ల కోసం అటవీ భూమిని గరిష్టంగా మళ్లించడం జరిగింది. గరిష్టంగా 19,424 హెక్టార్ల అటవీ భూమిని రోడ్ల వినియోగానికి మళ్లించారు.
రోడ్లకోసం అడవుల నరికివేత
గత ఐదేండ్లలో అడవులను అటవీయేతర ప్రయోజనాల కోసం అడ్డదిడ్డంగా నరికివేస్తున్నారు. ఇలా 19,424 హెక్టార్ల మేర అడవులు నరికేశారు. అంతేకాదు.. మైనింగ్ కార్యకలాపాలకోసం అడవులను కార్పొరేట్లకు అప్పనంలా అప్పగించేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న . నివేదికల ప్రకారం, 18,847 హెక్టార్ల అటవీ భూమిని మైనింగ్ కార్యకలాపాలకు ఉపయోగించుకోవడానికి అనుమతించి ంది కేంద్ర ప్రభుత్వం.మరోవైపు జల ప్రాజెక్టులకోస మంటూ..మరో 13,344 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించారు. వీటితో పాటు 9,469 హెక్టార్ల అటవీ భూమిని విద్యుత్ ప్రాజెక్టుల కోసం కేటాయించారు. విద్యుత్ టవర్లు , వైర్లు వేయడం కోసం మళ్లించారు.
సాయుధ బలగాల కోసమంటూ..
సాయుధ బలగాల వినియోగానికి కూడా పెద్ద ఎత్తున అటవీ భూమిని కేటాయించారు. అడవుల్లో మావోయిస్టులను ఏరివేయటంపై కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టిందని స్పష్టమవుతోంది. అందువల్ల. వివిధ రక్షణ ప్రాజెక్టుల కోసం గత ఐదేండ్లలో 7,630 హెక్టార్ల అటవీ భూమి ఉపయోగించబడింది.
అడవుల నిర్వచనం ఏమిటంటే..
దేశంలో ఒక హెక్టారు కంటే ఎక్కువ విస్తీర్ణం (భూమి)లో పచ్చదనం 10 శాతం కంటే ఎక్కువ ఉంటే, దానిని అడవీ అంటారు. అప్పుడు అది నిజంగా అడవి అయినా లేదా ఎవరిదో పొలం అయినా లేదా తోట అయినా లేదా ఎవరి వ్యక్తిగత ఆస్తి అయినా.అలాగే గుర్తిస్తారు. అయితే వాస్తవానికి నమోదైన అటవీప్రాంతం కాకుండా, ఐదేండ్లలో భారతదేశం 668,400 హెక్టార్ల అడవులు కోల్పోయింది.
బ్రెజిల్ తర్వాత భారత్
అటవీ విధ్వంసం విషయంలో బ్రెజిల్ తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది.
అయినప్పటికీ, 13 జనవరి 2022న ప్రచురించబడిన ''ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021'' (ఐఎస్ఎఫ్ఆర్ 2021)లో విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే, 2019 , 2021 మధ్యకాలంలో అటవీ విస్తీర్ణంలో 1.6 లక్షల హెక్టార్ల (0.2 శాతం) స్వల్ప పెరుగుదల కనిపించింది. . కానీ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇవి ఎక్కువగా ఫారెస్ట్ రికార్డ్ ఫారెస్ట్ (రాష్ట్ర ప్రభుత్వాల అటవీ శాఖ పరిధిలోని అటవీ భూమి) వెలుపల పెరుగుతున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) చేసిన విశ్లేషణ ప్రకారం, 25.9 మిలియన్ హెక్టార్లలో విస్తరించి ఉన్న అడవులు, దాదాపు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ పరిమాణంలో లేవు. విశ్లేషణ ప్రకారం, ఇంత భారీ వ్యత్యాసానికి (ఐఎస్ఎఫ్ఆర్ )2021లో ఎలాంటి వివరణ లేదు. ఈ రికార్డ్ చేయబడిన అడవిలో అటవీ విస్తీర్ణం లేకుండా పోయిందనేది మాత్రమే చూసినట్లయితే, ఈ తప్పిపోయిన అటవీ ప్రాంతం అంత విశాలంగా లేకుంటే, దానిని విస్మరించవచ్చు. కానీ సుమారు 26 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణాన్ని విస్మరించడం సాధ్యం కాదు.
భారతదేశం 1990 , 2000 మధ్యకాలంలో 384,000 హెక్టార్లలో అడవులను కోల్పోయింది. అదే సమయంలో, 2015, 2020 మధ్య ఇది 668,400 హెక్టార్లకు పెరిగింది. అంటే ఈ రెండు కాలాలలో, భారతదేశం అటవీ విధ్వంసంలో 284,400 హెక్టార్ల పెరుగుదలను చూసింది, ఇది ప్రపంచంలోనే అత్యధికం.కార్పొరేట్ల లాభాల కోసం అడవులను వేగంగా నరికివేస్తున్నారు.
ఇలాగే అడవుల హననం కొనసాగితే శ్వాస పీల్చటానికీ ఆక్సిజన్ స్తంభాలను భుజాలపై పెట్టుకునే రోజులు ఎంతో దూరంలో లేవని పర్యావరణ వేత్తలు అంటున్నారు.