Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వాజూ'కు అనుమతి కోరిన మసీదు కమిటీ
న్యూఢిల్లీ : రంజాన్ మాసంలో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో 'వాజూ' చేసుకోవడానికి అనుమతినివ్వాల్సిందిగా అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ చేసిన పిటిషన్పై ఈ నెల 14న విచారిం చడానికి సుప్రీం సోమవారం అంగీకరించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు శివలింగం నమూనాలో ఉందంటూ కొందరు చెబుతున్న ప్రాంతాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా గతేడాది నవంబరు 11న సుప్రీం కోరింది. ఈ అంశంపై త్వరగా విచారణ చేపట్టాల్సిందిగా మసీదు కమిటీ తరపు సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మది కోర్టును కోరారు. దీనిపై ఈ నెల 14న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి వారణాసి కోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని కోరుతూ కొందరు హిందువులు చేసిన విజ్ఞప్తిపై ఈ నెల 21న విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.