Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వయానాడ్ : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ లోక్‌సభలో అనర్హతవేటుకు గురైన తర్వాత తొలిసారి తన నియోజకవర్గమైన వాయనాడ్ కు మంగళవారం (ఏప్రిల్ 11) రానున్నారు. వాయనాడ్‌లో రాహుల్ మంగళవారం రోడ్‌షోను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక అక్కడ రాహుల్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, మోడీ ఇంటిపేరు గురించి రాహుల్‌గాంధీ 2019లో చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌లోని సూరత్ కోర్టు అతనికి రెండేండ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్షానంతరం అతనిపై లోక్‌సభలో అనర్హత వేటు పడింది. ఇక ఈ కేసు విషయంలో రాహుల్‌కి ఏప్రిల్ 4న సూరత్‌కోర్టు బెయిల్ మంజూరైంది. అయితే రాహుల్ అప్పీల్‌పై ఏప్రిల్ 13వ తేదీన ఆ కోర్టు విచారణ చేపట్టనుంది.