Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ విచారణ కోరిన కెఎ పాల్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ : తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహా, జస్టిస్ జెబి పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ అభ్యర్థన ఎలా చేస్తారని కెఎ పాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ నూతన సచి వాలయంలో అగ్నిప్రమాదం కాదనీ, నరబలి జరిగిందని పిటిషనర్ ఇన్ పర్సన్ పాల్ వాదించారు. ఇలాంటి పిటిషన్లు విచారించబోమని సీజేఐ స్పష్టం చేశారు. తాను 23 గంటలు ప్రయాణించి వచ్చానని కెఎ పాల్ చెబుతుం డగా.. సీజేఐ జోక్యం చేసుకొని ''ఏదేదో వాదిస్తున్నారు. ఉద్దేశం వేరుగా ఉంది. రాజకీయ వ్యక్తి కదా...'' అని వ్యాఖ్యానించారు. దేశానికి బిలియన్లలో డొనేషన్లు ఇచ్చాననీ, ఆరుగురు సీఎంలు తన పీస్ ర్యాలీలకు వచ్చారని పాల్ పేర్కొన్నా రు. కాగా, దేశంలో జరుగుతున్న అన్ని అగ్నిప్రమాదాలపైనా సీబీఐ విచారణ జరపమనాలా? అంటూ అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది.