Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్ కు జాతీయ హౌదా
- సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీకి తొలగింపు
- ఆరు పార్టీలకు రాష్ట్ర హౌదా కట్
- కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో మూడు పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హౌదా రద్దు చేసింది. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి కొత్తగా జాతీయ హౌదా లభించింది. సీపీఐ,తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు జాతీయ హౌదాను రద్దు చేస్తున్నట్లు సిఈసి ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో ఆర్ఎల్డీ, ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్, మణిపూర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్పీ, మిజోరంలో ఎంపీసీలకు ఇచ్చిన రాష్ట్ర పార్టీ హౌదాను కూడా కమిషన్ రద్దు చేసింది. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ అనే నాలుగు రాష్ట్రాల ఎన్నికల పనితీరు ఆధారంగా ఆప్ కుజాతీయ హౌదా కల్పిస్తున్నట్టు కమిషన్ పేర్కొంది.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో వారి పనితీరు ఆధారంగా నాగాలాండ్, మేఘాలయలో ఎన్సీపీ, తృణముల్ కాంగ్రెస్‌లు వరుసగా రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయని కమిషన్ తెలిపింది. నాగాలాండ్‌లోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్), మేఘాలయలోని వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి, త్రిపురలోని టిప్రా మోతాకు రాష్ట్ర రాజకీయ పార్టీ హౌదాను కూడా మంజూరు చేసినట్టు కమిషన్ పేర్కొంది. దీంతో ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్, సీపీఐ(ఎం), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఆప్ లుజాతీయ పార్టీలుగా ఉన్నాయి..