Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమూల్ వర్సెస్ నందిని
- సహకార వ్యవస్థను కబళించే కుట్ర
- ఎన్నికల వేళ పార్టీల కలవరపాటు
బెంగళూరు : ఎన్నికల వేళ కర్నాటకలో 'పాల' రగడ ప్రధాన రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. ఈ నెల ఐదున అమూల్ చేసిన ఓ ట్వీట్‌తో వివాదం మొదలైంది. బెంగళూరులో పాలు, పెరుగు విక్రయించబోతున్నట్టు వెలువడిన ఆ ట్వీట్ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా అనేక కంపెనీలు పాలు, పాల ఉత్పత్తులు విక్రయిస్తుంటాయి. అయితే కర్నాటక విషయం వేరు. అక్కడ ఇప్పటి వరకూ నందినీ ఉత్పత్తులదే హవా. ఇప్పుడు ఆ రాష్ట్రంలోకి గుజరాత్‌కు చెందిన అమూల్ ప్రవేశిస్తానంటోంది. అసలే ఎండాకాలం. ఆ వేడికి ఇప్పుడు 'పాల' వేడి తోడైంది. రాష్ట్రంలో అధికారం కోసం మూడు పార్టీలు తీవ్రంగా చెమటోడుస్తున్నాయి. తిరిగి అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తోంది. మరోవైపు పూర్వవైభవం పొందేందుకు కాంగ్రెస్ తహతహలాడు తోంది. వీటి మధ్యలో జెడీ (ఎస్) ఎలాగైనా అధిక స్థానాలు సంపాదించి, హంగ్ ఏర్పడితే చక్రం తిప్పాలని యోచిస్తోంది. వీటితో పాటు ఆప్ కూడా ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుం టోంది. కనీసం సాధ్యమై నన్ని ఎక్కువ ఓట్లు సాధించి ఉనికి చాటుకోవాలని చూస్తోంది. పైగా దానికి ఇప్పుడు జాతీయ పార్టీ హోదా కూడా లభించింది. అధికార బీజేపీ సహా ఈ పార్టీలన్నీ రాష్ట్రంలోకి అమూల్ రాకను ముక్తకంఠంతో వ్యతి రేకిస్తున్నాయి. రైతులందరూ నిరసన తెలపాలని ఆయ పార్టీలు పిలుపు ఇస్తున్నాయి. నందిని బ్రాండ్ ఉత్పత్తులను విక్రయిస్తున్న కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్), అమూల్ బ్రాండ్ ఉత్పత్తు లను విక్రయిస్తున్న గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య (జీసీఎంఎంఎఫ్)లను విలీనం చేయాలన్న కుట్రతో కేంద్రప్రభుత్వం అమూల్‌ను తెరపైకి తెస్తోందని ప్రతిపక్షాలు విమ ర్శిస్తున్నాయి.
పెరుగు ప్యాకెట్లపై హిందీలో 'దహీ' అని ముద్రించేందుకు చేసిన ప్రయత్నాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చలు, ఆందోళనలే కన్పిస్తున్నా యి. ఈ వ్యవహారం చిన్నకారు రైతులు, వారి ప్రయోజనాలతోనే ముడిపడినప్పటికీ ఇప్పుడది మరింత విస్తరించింది. ఒక్క మాటలో చెప్పాలం టే 'పాలు' అనే అంశం కర్నాటక ఎన్నికల కురు క్షేత్రంలో ఓ ఆయుధమై పోయింది. 'కర్నాటకలో తిండి, బట్ట, నివాసంతో పాటు పాలు కూడా ఒక భాగమే' అన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు వాస్తవాలను పరిశీలిద్దాం. కేఎంఎఫ్ అనేది సహ కార సంస్థ. అది కూడా గుజరాత్లో అమూల్ బ్రాండ్ యజమాని జీసీఎం ఎంఎఫ్ లాంటిదే. ఈ రెండూ పాల వినియోగదారులకు సేవలు అంది స్తున్న సంస్థలే. జీసీఎంఎంఎఫ్ వార్షిక టర్నోవర్ 72 వేల కోట్ల రూపాయలు కాగా కేఎంఎఫ్ టర్నోవర్ రూ. 25 వేల కోట్లు. దేశమంత టికీ ఒకే పాల సమాఖ్య ఉండాలా అన్నదే ఇప్పుడు చర్చనీ యాంశం. 'ఒకే దేశం ఒకే పన్ను' తరహాలో 'ఒకే దేశం, ఒకే పాలు' అనే నినాదాన్ని ముందుకు తేవా లని బీజేపీ ప్రయత్నిస్తోంది. అమూల్ ఉత్పత్తుల కు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందు కు కేంద్రం చేయని ప్రయత్నమంటూ లేదు. అయి తే ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేమంటే మన దేశం ఫెడరల్ ప్రజాస్వామిక దేశం. అనేక రాష్ట్రా ల సమాహారం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష, భిన్నమైన ఆహార అలవాట్లు, ఆర్థిక ప్రయోజనా లు....ఇలా అన్ని విషయాలలోనూ భిన్నత్వం కన్పిస్తుంది. స్థానిక ప్రయోజనాల పరిరక్షణ కు, స్థానిక వ్యాపారాలకు ఊతమిచ్చేందుకే మన దేశంలో సహకారోద్యమం ప్రారంభమైంది. ఆర్థిక వ్యవహారాలు, పాలు, చక్కెర, వినియోగం, గృహ నిర్మాణం వంటి విషయాలలో స్థానికులకు పెద్ద పీట వేయడమే దీని లక్ష్యం. తమ ప్రయోజనాల కు భంగం కలిగించే దేనినీ ప్రజలు సమ్మతించరు. వ్యతిరేకంగా గళం విప్పుతారు. ఇప్పుడు కర్నాటక లో జరుగుతోంది అదే. పాడి రైతు ల్లో అభద్రతా భావం కన్పిస్తోంది.
కర్నాటకలో స్థానికంగా లభించే నందిని ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి. అదే బయటి రాష్ట్రానికి చెందిన అమూల్ ఉత్పత్తుల ధర ఎక్కువగానే ఉంటుంది. ఇది భావో ద్వేగాలకు సంబంధించిన విషయం. ఏదేమైనా ఇప్పుడీ ఆందోళన విస్తృతమైంది. బహుళజాతి కంపెనీగా రూపాంతరం చెందుతున్న అమూల్, సహకార వ్యవస్థలో ఉన్న చిన్న నందిని బ్రాండ్ల మధ్య పోరు తీవ్రమవు తోంది. ఒకప్పుడు చిన్న సంస్థగా ప్రారంభమైన అమూల్, ఇంతింతైవటు డింతై అన్నట్టు పెరిగిపోతోంది. వివిధ రాష్ట్రాల లోని చిన్న చిన్న పాల సహకార వ్యవస్థలను కబళించేందుకు అర్రులు చాస్తోంది.