Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందులో 14 రకాల హానికర బాక్టీరియా
- ఇది మానవులకు పనికి రాదు : ఐవీఆర్ఐ పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో గోమూత్రంపై అశాస్త్రీయమైన ప్రకటనలు చేసే బీజేపీ, హిందూత్వ సంస్థల మాటలు తప్పని రుజువయ్యాయి. గోమూత్రంలో 14 రకాల హానికర బాక్టీరియా ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అలాగే, ఈ ఆవు మూత్రం మనుషులక పనికిరాదని స్పష్టం చేసింది. యూపీలోని బరేలీలో గల ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) పరిశోధనలో ఇది తేలింది. దేశంలోని ప్రధానమైన జంతు పరిశోధక సంస్థ అయిన ఐవీఆర్ఐ అప్పుడే తీసుకొచ్చిన ఆవు మూత్రాన్ని పరిశోధించింది. అందులో హానికరమైన బాక్టీరియా కలిగి ఉండొచ్చని తెలిపింది. దీనిని నేరుగా వినియోగించడానికి సరిపోదని స్పష్టం చేసింది. కడుపునొప్పిని కలిగించే ఎస్చెరిచియా కోలితో పాటు కనీసం 14 రకాల హానికరమైన బాక్టీరియాను ఆవు మూత్రం కలిగి ఉంటుందని తేలింది. ఇన్స్టిట్యూట్కు చెందిన భోజ్రాజ్ సింగ్ నేతృత్వంలో ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులతో ఈ అధ్యయనం జరిగింది. ఈ పరిశోధనను ఆన్లైన్ రీసెర్చ్ వెబ్సైట్ రీసెర్చ్గేట్లో ప్రచురించారు.