Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు జవాన్ల మృతి
చండీగఢ్: పంజాబ్లోని బటిండా సైనిక కేంద్రంలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర పోలీసులతో కలిసి ఆ ప్రాంతాన్ని దిగ్బంధించామని, కాల్పులకు కారణాలు తెలుసుకుంటున్నామని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. 'ఇది దురదృష్టకరమైన సంఘటన. కాల్పుల ఘటనలో నలుగురు సైనిక జవాన్లు చనిపోయారు. ఆస్తినష్టం జరిగిన సమాచారం లేదు' అని వివరించింది. రెండు రోజల క్రితం ఒక తుపాకీ, 28 రౌండ్ల తూటాలు కనిపించకుండా పోయాయని, దానికీ ఈ ఘటనకు ఏదైనా సంబంధం ఉన్నదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని సైన్యం పేర్కొంది. సైనికులను చంపిన దుండగులను పట్టుకునేందుకు సైన్యం హెక్సాకాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తోంది. దేశంలో అతిపెద్ద సైనిక కేంద్రాలలో బటిండా కూడా ఒకటి. కాగా ఇది ఉగ్రవాద దాడి కాదని, సైనిక కేంద్రంలో జరిగిన అంతర్గత పరిణామమని బటిండా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ గుల్నీత్ సింగ్ ఖురానా చెప్పారు.