Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడి నేత తేజస్వి యాదవ్, జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. బీజేపీపై ఐకమత్యంగా పోరాడే అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఇది చారిత్రక సమావేశమని అన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తేవడమే తమ లక్ష్యమని తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది చరిత్రాత్మక ముందడుగు అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను సమైక్యపర్చడం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇది ఓ ప్రక్రియ అని, దేశం కోసం ప్రతిపక్షాల దార్శనికతను ఇది తీర్చిదిద్దుతుందన్నారు. తాము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామనీ, దేశాన్ని కాపాడతామని తెలిపారు. ప్రజా గళాన్ని వినిపించాలనీ, దేశానికి నూతన దిశను ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు శపథం చేశారన్నారు. నితీశ్ కుమార్ మాట్లాడుతూ సాధ్యమైనన్ని పార్టీలను సమైక్యపర్చి, కలిసికట్టుగా పని చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అంతకు ముందు ఆర్జేడి అగ్ర నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన కుమార్తె మీసా భారతి నివాసంలో నితీశ్ కుమార్ కలిశారు. లాలూ తన కుమార్తె మీసా భారతి నివాసంలో ఉన్నారు.