Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఏడాదికేడాది తో పోల్చితే కంపెనీ లాభాలు 8 శాతం పెరిగి రూ.6,128 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 16 శాతం పెరిగి రూ.37,441 కోట్లకు చేరింది. క్యూ4లో టిసివికి చెందిన 2.1 బిలియన్ డాలర్ల కొత్త ప్రాజెక్టును దక్కించుకున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.17.50 డివిడెండ్‌ను ప్రకటించింది. 2023 డిసెంబర్ 31 నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగులు 3,43,234గా ఉన్నారు. ఇంతక్రితం ఏడాది ఇదే కాలం నాటికి 3,46,845 మంది ఉద్యోగులున్నారు. దీంతో పోల్చితే నికరంగా 3,611 మంది తగ్గిపోయారు. గురువారం బిఎస్ఇలో ఇన్ఫోసిస్ షేర్ 2.79 శాతం తగ్గి రూ.1,388 వద్ద ముగిసింది.