Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న కోవిడ్ పాజిటివిటీ రేటు
ఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 10,158 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. గత ఎనిమిది నెలల్లో ఇవే అత్యధికం. కొత్తగా 2,29,958 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపింది. ముందురోజుతో పోల్చితే 30శాతం కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి పెరిగింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,42,10,127కి చేరింది. రికవరీ రేటు 98.71 శాతంగా నమోదైంది. ఇప్పటివరకూ 220.66 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు దేశవ్యాప్తంగా ప్రజలు వినియోగించినట్లు కేంద్రం తెలిపింది. రాబోయే 10-12 రోజుల్లో కేసులు మరింతగా పెరుగుతాయని సంబంధిత వర్గాలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.