Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 43 మంది అరెస్టు
భువనేశ్వర్ : సంబల్పూర్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను గురువారం ఉదయం 10 గంటల నుంచి 48 గంటల పాటు ఒడిషా ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా నిరోధించడానికే ఒడిషా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒడిషాలో మహ విసుభ సంక్రాతి రోజున హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. అది ఈ ఏడాది శుక్రవారం వచ్చింది. నకిలీ వార్తలు వ్యాప్తితో అల్లర్లు జరుగుతాయనే సందేహంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. గత నెలలో శ్రీరామనవమికి ముందు రోజున నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంతో జిల్లాలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లులో 10 మంది పోలీసులతో సహా అనేక మంది సాధారణ పౌరులు గాయపడ్డారు. కాగా, ఈ అల్లర్లుకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకూ 43 మందిని అరెస్టు చేసినట్లు సంబల్పూర్ జిల్లా ఎస్పి బి గంగాధర్ తెలిపారు. ఇంటర్నెట్ సేవలను నిషేధిస్తున్నట్లు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (హోం శాఖ) డికె సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్నేట్ సేవలను బంద్ చేయడంతో పాటు ఆరు పోలీస్ స్టేషన్లు సంబల్పూర్ టౌన్, ధనుపాళి, ఖేట్రాజ్పుర్, అయింతపలి, బరైపాలి, సదార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు ఎస్పి తెలి పారు. శ్రీరామనవమి రోజున జరిగిన అల్లర్లులో కుట్ర కోణం ఉందా అనే ప్రశ్నకు 'ఈ విషయంపై దర్యాప్తు జరుగుతుంది' అని ఎస్పి సమాధానం ఇచ్చారు.