Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేషరతుగా క్షమాపణ చెప్పండి : లలిల్ మోడీకి సుప్రీంకోర్టు హుకుం
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీపై సుప్రీంకోర్టు గురు వారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బేష రతుగా క్షమాపణ చెప్పాలని ఆయన ను ఆదేశించింది. సోషల్ మీడియా లోనూ, ప్రముఖ వార్తాపత్రికల లోనూ క్షమాపణ ప్రకటనలు చేయాలని సూచించింది. క్షమాపణ కోరుతూ తన ముందు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. భవిష్యత్తులో భారత న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగ జార్చేలా ఎలాంటి పోస్టులు పెట్టబోనని అందు లో పేర్కొనాలని నిర్దేశించింది. లలిత్ మోడీ చట్టానికి, సంస్థలకు అతీతుడేమీ కాదని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి. రవికుమార్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌పై తాను సంతృప్తి చెందడం లేదని తెలిపింది.