Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులన్నీ కలిస్తేనే సాధ్యం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్,సీపీఐ జాతీయకార్యదర్శివర్గ సభ్యులు బినయ్ విశ్వం
విజయవాడ : దేశంలోని లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులన్ని కలిస్తేనే 2024 ఎన్నికల్లో బీజేపీని సాగనంప గలుగుతామని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు బినయ్ విశ్వం అన్నారు. ఐక్య ఉద్యమాలే శరణ్యమనీ, రాజకీయ పక్షాలు ఆయా రాష్ట్రాల పరిస్థితులకనుగుణంగా ఏకం కావాల్సిన అవసరమున్నదని తెలిపారు. హిందూత్వ కార్పొరేట్ కూటమి కి మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటూ దేశంలో బడా పారిశ్రామిక రాజ్యాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందనీ, దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఐక్య ఉద్యమాలు తీసుకు రావా లని తెలిపారు. ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీ, మోడీని సాగనంపుదాం, దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సీపీఐ్ష సీపీఐ(ఎం) చేపట్టిన ప్రచారభేరిని శుక్రవారం ప్రారంభించారు. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతకు ముందు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి నివాళలర్పించారు. అనంతరం ర్యాలీగా ఏలూరు రోడ్డు, మ్యూజియం రోడ్డు మీదగా ఎంబి విజ్ఞాన కేంద్రానికి ర్యాలీగా వెళ్లారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ముందుగా ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ.. దేశ రాజ్యాంగం ఏర్పాటులో బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషిం చారనీ, ఆయన సారధ్యంలో లౌకిక ప్రజాతంత్ర రాజ్యాంగం గా ఏర్పడిందన్నారు. దేశాన్ని మనుస్మృతి ఆధారంగా హిం దూ రాష్ట్రంగా మార్చాలనే సిద్ధాంతాన్ని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసిన మోడీ, మంత్రులు ఆ రాజ్యాంగాన్నే వమ్ము చేస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర పోరాటంలో ముస్లిం లు ఉన్నారనే కారణంతో ఆర్ఎస్ఎ పాల్గనలేదని, పైగా ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందన్నారు. స్వాతం త్రం వచ్చిన తరువాత కూడా భారత రాజ్యాంగం లౌకిక, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండకూదని వ్యతిరేకించిందని వివ రించారు. భారతదేశం హిందూ రాష్ట్రంగా మారడం అంటే దేశ వినాశనమే అని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. అటువంటి అంబేద్కర్‌ను తమ సొంతం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగంలోని లౌకికతత్వాన్ని నాశనం చేసి, హిందూత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో లౌకిక చట్టాలు తొలగించి హిందూత్వ చట్టాలు తీసుకొచ్చారని మండిపడ్డారు. లవ్ జీహాద్, గో రక్షక చట్టాల పేరుతో బాధితులపై దాడులు చేస్తున్నారని తెలిపారు. హిందూత్వ విధానాల మద్దతు కోసం హిందూత్వ కార్పొరేట్ కూటమి లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల సమస్యలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాల గొంతును పార్ల మెంటులో నొక్కుతుందని, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల ను ప్రతిపక్షాలపై ఊసిగొల్పి దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో కొద్దిమంది పెట్టుబడిదారులు మాత్రమే పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించారని తెలిపారు. దేశంలోని ఎయిర్‌పోర్టులు, పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు అదానీకి అప్ప గించడంతో అతని ఆస్తులు పెరిగాయని తెలిపారు. ప్రస్తు తం కొద్దిమంది వద్దే సంపదంతా పొగుపడుతోందని, ఇది దేశంలో అసమానతలు తగ్గించాలనే రాజ్యాంగ మౌలిక సూ త్రానికి విరుద్ధమన్నారు. హిందూత్వ విధానాలు అమలు పరుస్తున్న మోడీకి కార్పొరేట్ శక్తులు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. మోడీ ఆర్ధిక విధానాల వల్ల దేశంలోని సామాన్య ప్రజలపై విపరీతమైన భారాలు పడుతున్నాయని చెప్పారు. కార్పొరేట్లపై పన్నులు మోపకుండా ప్రజలపై పన్నులు, భారాలు మోపుతున్నారని విమర్శిం చారు. సంపదంతా ఒక చోట పొగుపడటం తో చిన్న కంపెనీలు మూతపడుతున్నాయని, దీనివల్ల నిరు ద్యోగం పెరిగిపోయిందన్నారు. వ్యవసాయంలో బడా కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తోందన్నారు. నిరు ద్యోగం పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, ప్రజలపై భారా లు పెరగడానికి కారణం మోడీ ఆర్థిక విధానాలు అని విమ ర్శించారు. మోడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా వామ పక్షాలు తీవ్ర పోరాటాలు చేస్తున్నాయని తెలి పారు. లౌకిక ప్రజాతంత్ర శక్తులు కలిసి మోడీకి వ్యతిరేకంగా పోరాడి ఎదిరిస్తేనే విజయం సాధించగలమనే విషయాన్ని గుర్తుంచు కోవాలని చెప్పారు. దక్షిణాదిలోని కర్నాటక రాష్ట్రం లోనే బీజేపీ అధికారంలో ఉందన్నారు. కేంద్రం నిరంకుశ విధానాలు, రాష్ట్రాల హక్కులు హరించే విధానాలకు వ్యతిరే కంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు పోరాడు తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన పరిస్థితి ఉందని, జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదనాన్నరు. పైగా బీజేపీ అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను రాష్ట్రంలో తూచ తప్పకుండా పాటిస్తోందన్నా రు.బినరు విశ్వం మాట్లాడుతూ విజయవాడ అంటే కమ్యూనిస్టు అగ్రనేతలు చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వం వహిం చిన ఉద్యమాలు, తెలంగాణ పోరాటాలు గుర్తు వస్తాయని తెలిపారు. దేశంలో మోడీ అనుసరిస్తున్న హిందుత్వ సిద్ధాం తానికి భిన్నమైన సిద్ధాంతం కమ్యూనిస్టుల దగ్గర ఉంద న్నారు. వామపక్షాలు మార్కిృజం సిద్ధాంతాన్ని అవలోకనం చేసుకుని, ప్రపంచాన్ని అర్థం చేసుకున్న పరిస్థితి మనకూ ఉన్నదని, ఈ సిద్ధాంతాలను కొందరు వెక్కిరించ డాన్ని తప్పుపట్టారు. కార్ల్‌మార్క్స్ చెప్పినట్లుగా పెట్టుబడి అందర్నీ తన బానిసలుగా చేస్తుందని, ఇది విస్తరిస్తున్న కొద్దీ ఎవరైనా దానికి బానిసగా మారాల్సిందేనని తెలిపారు. నేడు మోడీ ప్రభుత్వ విధానంలో అవే విధానాలను చూస్తున్నా మన్నారు. ప్రధాని మోడీ అదాని అనే పెట్టుబడిదారులకు బానిసలుగా మారిపోయారంటూ విమర్శించారు. ఫాశిస్టు సిద్ధాంతంతో దేశాన్ని పరిపాలించేందుకు మోడీ నాయకత్వం లోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అంబేద్కర్ గురించి మాట్లాడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆయన చెప్పిన సిద్ధాంతాల్ని అనుసరించడం లేదని విమర్శించారు. హిందూ రాజ్యం అనేదీ దేశ విధానం కాదంటూ అంబేద్కర్ చెబితే దానికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్య బట్టారు. సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీని వాసరావు మాట్లాడుతూ ఒక వైపున అంబేద్కర్‌కు భారీ ఎత్తున విగ్రహాలు కట్టి, పెద్దఎత్తున ప్రభుత్వాలు ఉత్సవాల్ని నిర్వహిస్తూ, మరోవైపు దళిత, ఆదివాసీ, బీసీలకు రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన హక్కులను విస్మరిస్తున్నాయని మండి పడ్డారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం ద్రోహం చేస్తుంటే సీఎం జగన్ మౌనంగా ఉండటం తగదన్నారు. సీపీఐ ఏపీ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ బిజెపి, ఆర్ఎస్ ఎస్ మతోన్మాద విధానాలను గద్దె దించాలంటే దేశంలోని కమ్యూనిస్టులతోపాటు ప్రతిపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కావాలని కోరారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్ అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పి మధు పాల్గొన్నారు.