Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రమబద్ధమైన దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
- మోడీ సర్కారుపై సోనియా గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రంలోని అధికార బీజేపీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోడీ సర్కారు పాలనలో రాజ్యాగం సంస్థల దుర్వినియోగం, అణచివేత జరుగుతున్నదని ఆరోపించారు. ఈ క్రమబద్ధమైన దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకో వడానికి ప్రజలు తప్పక స్పందించాలని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఒక వార్త సంస్థకు రాసిన ఆర్టికల్లో సోనియా గాంధీ తన ఆలోచనలను వ్యక్తపరిచారు. మతం, భాష, కులం, లింగం ఆధారంగా భారతీయుల్లో విభజన తీసుకురావడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నవారు అసలైన 'దేశ ద్రోహులు' అని సోనియా గాంధీ పేర్కొన్నారు.
ఈ రోజు మనం బాబాసాహెబ్ వారసత్వాన్ని గౌరవిస్తున్నందున రాజ్యాంగం విజయం పరిపాలించే బాధ్యతను అప్పగించిన ప్రజల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్న ఆయన ముందస్తు హెచ్చరికను గుర్తుంచుకోవాలని వివరిం చారు. ప్రస్తుత ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థల పునాదులైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాన్ని బలహీనపరుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను కాపాడటానికి బదులు చట్టాన్ని దుర్వినియోగపర్చడం ద్వారా వారి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతున్నదనీ, చాలా మంది భారతీయు లు ఆర్థికంగా నష్టపోతు న్నప్పటికీ.. ప్రతి రంగం లోనూ ఎంపిక చేసుకున్న స్నేహితులకు అనుకూలం గా వ్యవహరించడం ద్వారా సమానత్వంపై దాడి జరుగుతున్నదని వివరించారు. భారత రాజ్యాంగం విషయంలో అంబేద్కర్ కృషిని ఆమె కొనియాడారు. దళితులు, అణగారిన వర్గాలు, వ్యక్తుల హక్కుల కోసం అంబేద్కర్ పోరాడని వివరించారు. భారత రాజ్యాంగం వెనకబడిన వర్గాలు, మైనారిటీలకు అనుకూలంగా ఉన్నదని పేర్కొన్నారు. అంబేద్కర్ అద్భుతమైన జీవితం నేటికీ భారతీయు లందరికీ చిరస్థాయిగా నిలిచిందని ఆమె వివరించారు.