Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రప్రభుత్వం స్పష్టీకరణ
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలుపుదల చేసినట్టు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తన వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రయివేటుపరం చేయాలని కేంద్రం అనుకోవడం లేదని, ప్లాంటును బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామంటూ కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ గురువారం చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ఉక్కు శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆర్ఐఎన్ఎల్ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియపై ఎలాంటి స్తంభన లేదని స్పష్టం చేసింది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై నిలుపుదలపై కొన్ని మీడియా నివేదికల గురించి ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తూ, ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉన్నదనీ, ఆర్ఐఎన్ఎల్ పనితీరును మెరుగుపరచడానికి, దానిని కొనసాగించడానికి కంపెనీతో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ప్రభుత్వం మద్దతునిస్తుందని పేర్కొంది.