Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో పార్టీకి సీనియర్లు గుడ్‌బై
బెంగళూరు : కర్నాటకలో శాసనసభ ఎన్నికల ముంగిట అధికార బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటి వరకూ విడుదలైన 212 మంది అభ్యర్థుల జాబితాలో 60 మంది సిటింగ్‌లకు చోటు దక్కలేదని సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా మరికొందరు అదే బాట పట్టబోతున్నారు. చిక్మగళూర్ జిల్లా ముదిగెరె ఎస్సీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారస్వామికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తుమకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి శివన్నది కూడా ఇదే పరిస్థితి. ఆయన సైతం పార్టీని వీడారు. టికెట్ దక్కని కొందరు నాయకులు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై విమర్శలు గుప్పిస్తున్నారు. హావేరి ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ తన మద్దతుదారులతో కలిసి నిరసనకు దిగారు. బెళగావి జిల్లా హుక్కెరిలో మాజీ మంత్రి శశికాంత్ నాయక్ టికెట్ నిరాకరణతో రాజీనామా చేశారు. అథానీ టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ లక్ష్మణ్ సావడి, పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. టికెట్ దక్కని హోస్దుర్గ్ ఎమ్మెల్యే గులిహట్టి శేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.