Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానిని కోరిన జమ్మూకాశ్మీర్ చిన్నారి
కథువా : 'మోడీజీ...దేశం చెప్పేది వినండి' జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లా లోహై-మల్హర్ గ్రామానికి చెందిన ఓ చిన్నారి ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్న ఈ మాటలు ఫేస్బుక్లో వైరల్ అవుతున్నాయి. తమ కోసం ఒక మంచి పాఠశాలను నిర్మించాలని కూడా ప్రధానిని ఆ బాలిక సీరత్ నాజ్ కోరింది. కొందరు స్నేహితులతో కలిసి, అపరిశుభ్రంగా ఉన్న తరగతి గదిలో నేలపై కూర్చుని ఉన్న సీరత్ ఫేస్బుక్ మాధ్యమంగా ప్రధానికి విజ్ఞాపనలు అందించింది. ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షల మంది చూడగా, 1.16 లక్షల మంది లైక్ కొట్టారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తాను చదువుకుంటున్నానని ఐదు నిమిషాల నిడివి కలిగిన ఆ వీడియోలో విద్యార్థిని తెలిపింది. పాఠశాల అంతటా ఆమె కలియతిరుగుతూ సౌకర్యాల లేమిని ఏకరువు పెట్టింది. అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. బీజేపీ లెఫ్టినెంట్ పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో..చిన్నారి ఆవేదన మోడీ పట్టించుకుంటారా..అన్నదానిపై పెద్ద చర్చ.