Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు విచారణకు రమ్మంటూ సమన్లు
- మోడీ-అదానీ బంధాన్ని ప్రస్తావించారనే అక్కసుతో...ఆప్
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆదివారం ఉదయం 11 గంటలకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనను ఈ కేసులో సాక్షిగా విచారిస్తారు. సీబీఐ చర్యపై అమ్ఆద్మీ పార్టీ మండిపడింది. నరేంద్ర మోడీ, అదానీ మధ్య సంబంధాలపై కేజ్రీవాల్ ఢిల్లీ శాసనసభలో ప్రస్తావించినందునే సీబీఐ ఈ సమన్లు జారీ చేసిందని ఆ పార్టీ నాయకుడు సంజరు సింగ్ విమర్శించారు. కాగా ఎఫ్ఐఆర్లో కేజ్రీవాల్ పేరు లేకపోయినప్పటికీ నిందితులు, సాక్షులను విచారించినప్పుడు ప్రస్తావనకు వచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై వివరణ కోరేందుకే కేజ్రీవాల్‌ను సాక్షిగా పిలుస్తున్నామని చెప్పారు.