Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారుతున్న వాతావరణ పరిస్థితులే కారణం
న్యూఢిల్లీ : దేశంలో ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరిలోనే వేసవి తాపం ఠారెత్తించింది. 1901 తర్వాత ఫిబ్రవరిలో ఇంత అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్, రాజస్థాన్ రాష్ట్రాలలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమ, ఉత్తర ప్రాంతాలలో వర్షపు జల్లులు కురుస్తున్నప్పటికీ మే నెలాఖరు వరకూ తీవ్రమైన వడగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రభావం అంతగా ఉండదని, వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.