Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోధుమల సేకరణ ధరను తగ్గించడం దారుణం
- దీనికి వ్యతిరేకంగా 18న దేశవ్యాప్త ఆందోళన :
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
న్యూఢిల్లీ: గోధుమల సేకరణ ధరను తగ్గించి రైతులపై మోడీ ప్రభుత్వం దాడికి దిగిందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) విమర్శించింది. కేంద్ర ప్రభుత్వ ఈ దారుణమైన రైతు వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 18న దేశవ్యాప్త నిరసనకు ఎస్కేఎం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎస్కేఎం ప్రకటన విడుదల చేసింది. గోధుమ నాణ్యతను సాకుగా చూపి రైతులపై మోడీ ప్రభుత్వం చేసిన తాజా దాడిని అన్ని స్థాయిల్లో ఎస్కేఎం ప్రతిఘటిస్తుందని పేర్కొంది. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు కారణంగా ఈ సీజన్లో పంటల నాణ్యత దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యానికి రైతులపై జరిమానా విధించడానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించింది. కొనుగోలు ధరను క్వింటాల్‌కు రూ.31.87 వరకు తగ్గించిందనీ, నాణ్యతను సాకుగా చూపి రైతుల నుంచి గోధుమల సేకరణ ధరను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడం రైతులను మోసం చేసి వారికి రావాల్సిన బకాయిలు లేకుండా చేయడమే తప్ప మరొకటి కాదని విమర్శించింది. ఇంతకుముందు, సేకరణ ను తగ్గించడానికి ప్రభుత్వం పరిమాణంపై సీలింగ్‌లను ఉపయోగించిందనీ, ఇప్పుడు ప్రభుత్వం నాణ్యత సాకుతో కొనుగోళ్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తు న్నదని, ఇది పూర్తిగా అన్యాయమని తెలిపింది.
ఈ విధానాలు చారిత్రాత్మక మైన రైతుల ఉద్యమానికి అన్నదాతలపై ప్రభుత్వ ప్రతీకారాన్ని స్పష్టం చేస్తు న్నాయని, నాడు ప్రజల అభీష్టం ముందు ప్రధానమంత్రి తలవంచవలసి వచ్చిందని పేర్కొంది.ప్రతి పంట గింజను తప్పనిసరిగా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి కొనుగోలు చేయాలని ఎస్కేఎం డిమాండ్ చేస్తున్నదని, నాణ్యత ఆధారంగా కొనుగోళ్లలో ఎలాంటి తగ్గింపును సహించదని స్పష్టం చేసింది. ఎందుకంటే వాతావరణ మార్పుల కారణంగా నాణ్యత వైవిధ్యాలు రైతుల తప్పు కాదని, ధరల తగ్గింపుపై సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవా లని డిమాండ్ చేసింది. గతేడాది వలే ఎంఎస్పి వద్ద పూర్తి సేకరణ చేయా లని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈ దారుణమైన రైతు వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 18న దేశవ్యాప్త నిరసనకు ఎస్కేఎం పిలుపు ఇచ్చింది. ప్రభుత్వం ఈ సర్క్యులర్‌ను ఉపసంహరించు కోకుంటే పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతాయని హెచ్చరించింది.