Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాది రాష్ట్రాల ఒత్తిడితో కేంద్రం వెనకడుగు
న్యూఢిల్లీ : కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షను ఇకపై 13 ప్రాంతీయ భాషల్లోనూ జరుపుతారు. తెలుగుతో పాటు అసోమీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు కేంద్ర హోం శాఖ ఆమోదముద్ర వేసింది. ఎప్పటి మాదిరిగానే ఇంగ్లీషు, హిందీ భాషల్లో కూడా ఈ పరీక్ష ఉంటుంది. వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. నిరుద్యోగ యువతకు ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన పరీక్షలను తమిళంలో కూడా నిర్వహించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా కేంద్రానికి దీనిపై గతంలో లేఖ రాశారు.