Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రకటన
న్యూఢిల్లీ : పోలీసు కస్టడీలో ఉన్న అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్‌లను మీడియా ముందే దారుణంగా హత్య చేయడం ఉత్తర ప్రదేశ్ పూర్తిగా చట్టవిరుద్ధ రాష్ట్రంగా మారినట్టు సూచిస్తుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 'భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన తీరు అధికారులు కుమ్మక్కయిన పరిస్థితిని సూచిస్తుంది. ఎన్కౌంటర్ హత్యలు పునరావృతమవుతుండటం న్యాయవ్యవస్థకు అతీతంగా జరుగుతున్న హత్యలే. ఈ పరిస్థితికి ఆదిత్యనాధ్ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలి. హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణ జరగాలి. ఈ హత్యల వెనుక ఉన్న వారందరినీ గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలి.' అని సిపిఎం డిమాండ్ చేసింది.