Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. తన ఎన్నికను సవాల్ చేస్తూ వైసిపి అభ్యర్థి మోదుగల వేణుగోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలంటూ గల్లా జయదేవ్ తొలుత ఏపి హైకోర్టును ఆశ్రయించారు. మెరిట్స్‌పై విచారణ చేస్తామంటూ ఏపి హైకోర్టు గల్లా జయదేవ్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో జయదేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జెకె మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టులో విచారణ ఎదుర్కోవాలని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.