Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిపోయిన ఎగుమతులు
న్యూఢిల్లీ : 2022-23లో చైనా నుంచి దిగుమతులు 4.16శాతం పెరిగాయి. అదే సమయంలో చైనాకు ఎగుమతులు 28శాతం తగ్గిపోయాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనా నుంచి దిగుమతులు 98.51 బిలియన్ డాలర్లకు చేరగా అక్కడికి ఎగుమతులు 15.32 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2021-22తో పోలిస్తే వాణిజ్య లోటు రికార్డు స్థాయికి పెరిగింది. 2021-22లో 72.91 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ లోటు 22-23కు 83.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 1.5శాతం తగ్గిపోయింది (115.42 బిలియన్ డాలర్ల నుంచి 113.83 బిలియన్ డాలర్లకు). భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి గడచిన ఆర్థిక సంవత్సరంలో అమెరికా అతి పెద్ద భాగస్వామిగా నిలిచింది. ఆ దేశంతో 128.55 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. అయితే ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి భారత్, చైనాలు వెల్లడించిన గణాంకాలలో కొంత వ్యత్యాసం కన్పిస్తోంది. సుంకాలు తగ్గించుకునేందుకు భారత దిగుమతిదారులు ఇన్వాయిస్ను తక్కువ చేసి చూపడం వల్లనే ఈ తేడా కన్పిస్తోందని వాణిజ్య నిపుణులు అంటున్నారు.