Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : పౌరుల స్థిర, చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను ఆధార్‌తో అనుసంధానంపై మీ వైఖరేమిటో తెలియచేయాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారింది. ఈ విషయంలో నాలుగు వారాల్లో ప్రతిస్పం దన తెలియజేయాలని కేంద్ర ఆర్థిక, న్యాయ, గృహ-పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీచేసింది. స్థిర, చరాస్తులకు దస్త్రాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకోవడం మంచి అంశమని హైకోర్టు అభిప్రాయప డింది. అవినీతి, నల్లధనం, బినామీ చెల్లింపులను అరికట్టేందుకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. అవినీతిని కట్టడి చేయడంతోపాటు బినామీ ఆస్తులను జప్తు చేయడం ప్రభుత్వం బాధ్యత అంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యారు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'ఉగ్రవాదం, నక్సలిజం, గ్యాంబ్లింగ్, మనీలాండరింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పెద్ద నోట్లతో బినామీ చెల్లింపులు సాగుతున్నాయి. ఫలితంగా నిత్యవసర వస్తువులతోపాటు ప్రధాన ఆస్తులైనటువంటి రియల్ ఎస్టేట్, బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల వీటన్నింటినీ అరికట్టవచ్చు. ప్రభుత్వం ఆధార్‌తో ఆస్తులను అనుసంధానిస్తే.. వార్షిక ఆదాయంలో రెండుశాతం వృద్ధి చెందుతుంది. నల్లధనం, బినామీ చెల్లింపుల ఆధిపత్యంతో కొనసాగుతున్న ఎన్నికలను ఇది ప్రక్షాళన చేస్తుంది' అని తన పిటిషన్లో పేర్కొన్నారు.