Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన తీవ్రమైన ఆరోపణలపై మోడీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానమిచ్చి, తన నిజాయితీని నిరూపించుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. పొలిట్‌బ్యూరో సోమవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పుల్వామా ఘటనపై వచ్చిన ఆరోపణలు మన దేశ భద్రతకు సంబంధించినవి, చాలా తీవ్రమై నవి అని పొలిట్‌బ్యూరో పేర్కొంది. మన జాతీయ భద్రత పరిరక్షణలో లోపాలను ఎంతమాత్రం విస్మరించడానికి వీల్లేదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35ఏ అధికరణలు రద్దు చేసిన తీరు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించిన వైనంపై వచ్చిన ఆరోపణలూ అంతే తీవ్రమైనవి. ఈ అంశాలపై మోడీ ప్రభుత్వం మౌనం పాటించడం మన జాతీయ భద్రతకు, మన దేశ సమైక్యత, సమగ్రతలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మన దేశ భద్రతా ప్రయోజనాలు, రాజ్యాంగ పవిత్రతను దృష్టిలో వుంచుకుని మోడీ ప్రభుత్వం ఈ ఆరోపణలన్నింటికీ జవాబివ్వాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.