Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోషుల విడుదలపై సుప్రీం మండిపాటు...
- నేడు బిల్కిస్.. రేపు ఇంకొకరు..
- ఆ పదకొండు మంది విడుదలకు కారణాలు చెప్పండి
- గుజరాత్ ప్రభుత్వానికి,కేంద్రానికి నోటీసులు
- వచ్చేనెల 2న తుది విచారణ
ఒక గర్భిణీపై సామూహిక లైంగికదాడి జరిగింది. అనేక మంది చంపబడ్డారు. బాధితురాలి కేసును ప్రామాణిక సెక్షన్ 302(హత్య) కేసులతో మీరు పోల్చలేరు. యాపిల్స్‌ను నారింజపం డ్లతో ఎలా పోల్చలేమో అలాగే ఊచకోతను ఒక హత్యతో పోల్చలేము. నేరాలు సాధారణంగా సమాజానికి, వర్గానికి వ్యతిరేకంగానే జరుగుతాయి'' అని ధర్మాసనం తెలిపింది.
దేని ఆధారంగా దోషులకు రెమిషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ప్రశ్నించింది. ''ఈ రోజు బిల్కిస్ బానో... రేపు ఇంకా ఎవరైనా. అది మీరు లేదా నేను కావచ్చు. రెమిషన్‌కు అనుమతివ్వడానికి గల కారణాలను మీరు చూపెట్టకపోతే, అప్పుడు మేము మా స్వంత నిర్ణయం తీసుకుంటాం'' అని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై సుప్రీంకోర్టు స్పందించింది. వారిని విడుదల చేయడానికి గల కారణాలు తెలియజేయాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దోషుల రెమిషన్ అనుమతికి సంబంధించిన ఒరిజినల్ ఫైల్లతో సిద్ధంగా ఉండాలని తమను సుప్రీంకోర్టు గత నెల 27న జారీ చేసిన ఈ ఆదేశాలను పున:సమీక్షించాలని కోరుతూ తాము పిటిషన్ దాఖలు చేసే అవకాశమున్నదని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపాయి. ఖైదు కాలంలో 11 మంది దోషులకు పెరోల్‌కు అనుమతించడాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం జోసెఫ్, బి.వి నాగరత్నలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
బిల్కిస్ బానో కేసులో దోషులకు రెమిషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం తుది విచారణను వచ్చేనెల 2న చేపట్టనున్నది. ఈ కేసులో నోటీసులు అందిన అందరు దోషులు తమ స్పందనను సమర్పించాలని ఆదేశించింది. రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసే విషయంలో వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని కేంద్రానికి, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. 2002లో గుజరాత్‌లోని గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడి, ఆమె కుటుంబ సభ్యుల హత్యను భయంకరమైన చర్యగా సుప్రీంకోర్టు గతనెల 27న అభివర్ణించింది. ఇతర హత్యల కేసుల్లో పాటించినట్టుగానే ఈ కేసులో దోషులకు రెమిషన్ కల్పించడంపై ఏకరీతి ప్రమాణాలు పాటించారా? అని ఆ సమయంలో గుజరాత్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.
బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం, ఇతరులు తమ స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. ఈ కేసులో 11 మంది దోషుల రెమిషన్‌కు అనుమతినిస్తూ వారిని విడుదల చేయడాన్ని బిల్కిస్ బానో సవాలు చేశారు. అలాగే, సీపీఐ(ఎం) నేత సుభాషిణి అలీ, స్వతంత్ర పాత్రికేయురాలు రేవతి లాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖా వర్మ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)లు దాఖలు చేసిన విషయం విదితమే. దోషులను గుజరాత్ ప్రభుత్వం గతేడాది ఆగస్టు 15న విడుదల చేసిన విషయం తెలిసిందే.