Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఎన్సిపి నుంచి కొందరు ఎమ్మెల్యీలను తనవైపు తిప్పుకొని ఒక ముఠాగా బిజెపిలోకి పిరాయించనున్నట్లు వచ్చిన వార్తలను ఎన్సిపి సీనియర్ నేత అజిత్ పవార్ తీవ్రంగా ఖండించారు. ఇవన్ని తప్పుడు ఊహాగానాలని ఆయన కొట్టిపారేశారు. ఎన్సిపి అనేది ఒక కుటుంబమని, పార్టీ అధ్యక్షులు శరద్ పవార్ నాయకత్వంలో పని చేస్తూనే ఉంటుందని తెలిపారు. ముంబయిలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు.