Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహార్ ప్రాంతంలో ప్రజలు మళ్లీ ఎర్రజెండా చేత పట్టి పోరుబాట పడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్, బిజెపి హామీల గొప్పలకు మోసపోయి ఆ పార్టీల్లో చేరిన వీరంతా ఆ పార్టీలిచ్చిన హామీలు నీటి మీద రాతలనేని గ్రహించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న భారీ అవినీతి, బిజెపి మతోన్మాద రాజకీయాలు ప్రజా ఐక్యతను దెబ్బతీస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక యువత అఘోరిస్తోందని తెలిపారు. కూచ్బెహార్కు చెందిన దాదాపు 400 కుటుంబాలు మంగళవారం నాడు ఎర్ర జెండా పట్టి ఉద్యమబాట పట్టారు. అవినీతి, నిరుద్యోగం ఇతర సమస్యలను పరిష్కరించేది వామపక్షాలు మాత్రమేనంటూ నినదించారు. భారీ ర్యాలీ చేపట్టి బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ పాలనాతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎల్లప్పుడూ అండదండగా నిలుస్తూవస్తున్న ఎర్రజెండాయేనని, అందుకే మళ్లీ ఎర్రజెండా చేబూనామని వారు తెలిపారు.